Logo

అలియా 6 - Leviticus 27:22 - 27:28

22
ఒకడు తాను కొనిన పొలమును, అనగా తన స్వాస్థ్యములో చేరనిదానిని హషేంకు ప్రతిష్ఠించినయెడల
23
యాజకుడు సునాదసంవత్సరమువరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేరచొప్పున హషేంకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలెను.
24
సునాదసంవత్సరమున ఆ భూమి యెవని పిత్రార్జితమైనదో వానికి, అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగిరావలెను.
25
నీ వెలలన్నియు పరిశుద్ధ స్థలముయొక్క వెలచొప్పున నిర్ణయింపవలెను. ఒక తులము ఇరువది చిన్నములు.
26
అయితే జంతువులలో తొలిపిల్ల హషేంది గనుక యెవడును దాని ప్రతిష్ఠింపకూడదు; అది ఎద్దయిననేమి గొఱ్ఱెమేకల మందలోనిదైననేమి హషేందగును.
27
అది అపవిత్రజంతువైనయెడల వాడు నీవు నిర్ణయించు వెలలో అయిదవవంతు దానితో కలిపి దాని విడిపింపవచ్చును. దాని విడిపింపనియెడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను.
28
అయితే మనుష్యులలోగాని జంతువులలోగాని స్వాస్థ్య మైన పొలములలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేని నైనను ఒకడు హషేంకు ప్రతిష్టించినయెడల ప్రతి ష్ఠించినదానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు, ప్రతి ష్ఠించిన సమస్తము హషేంకు అతి పరిశుద్ధముగా ఉండును.