Logo

హాఫ్తారా - Ezekiel 22:1-16

1
మరియు హషేం వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
2
నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చునెడల అదిచేయు హేయక్రియలన్నిటిని దానికి తెలియజేసి యీలాగున ప్రకటింపవలెను.
3
ప్రభువైన హషేం సెలవిచ్చునదేమనగా నీ కాలము వచ్చునట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరచుకొనునట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా, నీవు చేసిన నరహత్యలచేత నీకు నీవే నేరస్థాపన చేసి కొంటివి, నీవు పెట్టుకొనిన విగ్రహములచేత నిన్ను నీవే అపవిత్రపరచుకొంటివి,
4
నీకు నీవే శిక్ష తెప్పించు కొంటివి, శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణ మైతివి. కాబట్టి అన్యజనములలో నిందాస్పదముగాను, సకలదేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియ మించుచున్నాను.
5
సమీపస్థులేమి దూరస్థులేమి అందరును అపకీర్తి పొందినదానవనియు అల్లరితో నిండినదాన వనియు నిన్ను అపహసింతురు.
6
నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరును తమ శక్తికొలది నరహత్యచేయుదురు,
7
నీలో తలిదండ్రులు అవమానమొందుదురు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు, నీలో తండ్రిలేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు,
8
నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతిదినములను నీవు అపవిత్రపరచుచున్నావు.
9
కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు, పర్వతములమీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి.
10
తమ తండ్రి మానాచ్ఛాదనము తీయు వారు నీలో నున్నారు, అశుచియై బహిష్టియైన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు.
11
ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును, మరియొకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును, నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరిని చెరుపుదురు.
12
నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన హషేం వాక్కు.
13
నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరచుకొనుచున్నాను.
14
నేను నీకు శిక్ష విధింప బోవుకాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీ కుండునా? హషేంనగు నేనే మాట ఇచ్చియున్నాను, దానిని నేను నెరవేర్తును, నీ అపవిత్రతను బొత్తిగా తీసి వేయుటకై
15
అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదును, ఇతర దేశములకు నిన్ను వెళ్లగొట్టుదును.
16
అచ్చట అన్యజనుల ఎదుటనే నీ అంతట నీవే భ్రష్ఠుడవై నేను హషేంనని నీవు తెలిసికొందువు.