అలియా 6 - Exodus 40:17 - 40:27
17
రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను.
18
హషేం మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువ బెట్టి దాని దిమ్మలనువేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండె బద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి
19
మందిరముమీద గుడారమును పరచి దాని పైని గుడారపు కప్పును వేసెను.
20
మరియు హషేం మోషేకు ఆజ్ఞా పించినట్లు అతడు శాసనములను తీసికొని మందసములో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను.
21
మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను.
22
మరియు హషేం మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరముయొక్క ఉత్తర దిక్కున, అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి
23
హషేం సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను.
24
మరియు హషేం మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడుప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల యెదుట దీపవృక్షమును ఉంచి
25
హషేం సన్ని ధిని ప్రదీపములను వెలిగించెను.
26
మరియు హషేం మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డ తెరయెదుట బంగారు ధూపవేదికను ఉంచి
27
దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను.