అలియా 1 - Exodus 35:1 - 35:20
1
మోషే ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగుచేసిమీరు చేయునట్లు హషేం ఆజ్ఞాపించిన విధు లేవనగా
2
ఆరు దినములు పనిచేయవలెను; ఏడవది మీకు పరిశుద్ధదినము. అది హషేం విశ్రాంతిదినము; దానిలో పనిచేయు ప్రతివాడును మరణ శిక్షనొందును.
3
విశ్రాంతి దినమున మీరు మీ యిండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్ట కూడదని వారితో చెప్పెను.
4
మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వసమాజ ముతో ఇట్లనెనుహషేం ఆజ్ఞాపించినదేమనగా
5
మీరు మీలోనుండి హషేంకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధిపుట్టిన ప్రతివాడు హషేం సేవనిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి,
6
నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్ననార మేకవెండ్రుకలు, ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱ,
7
ప్రదీపమునకు తైలము,
8
అభిషేకతైలమునకును పరిమళ ద్రవ్య ధూపమునకును సుగంధ సంభారములు,
9
ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలును చెక్కు రత్నములును తీసికొని రావలెను.
10
మరియు వివేక హృదయులందరు వచ్చి హషేం ఆజ్ఞాపించినవన్నియు చేయవలెను.
11
అవేవనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకఱ్ఱలు దాని స్తంభములు దాని దిమ్మలు.
12
మందసము దాని మోతకఱ్ఱలు, కరుణా పీఠము కప్పు తెర,
13
బల్ల దాని మోతకఱ్ఱలు దాని ఉపకరణములన్నియు, సన్నిధి రొట్టెలు,
14
వెలుగుకొఱకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు, దీపములకు తైలము
15
ధూపవేదిక దాని మోతకఱ్ఱలు, అభిషేకతైలము పరిమళద్రవ్య సంభారము, మందిర ద్వార మున ద్వారమునకు తెర.
16
దహన బలిపీఠము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మోతకఱ్ఱలు దాని యుపకరణములన్నియు, గంగాళము దాని పీట
17
ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర
18
మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్లు
19
పరిశుద్ధస్థలములో సేవచేయుటకు సేవావస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్ర ములు యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములు నవియే అనెను.
20
ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుటనుండి వెడలిపోయెను.