Logo

హాఫ్తారా - I Kings 7:40-50

40
మరియు హీరాము తొట్లను చేటలను గిన్నెలను చేసెను. ఈ ప్రకారము హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞనుబట్టి హషేం మందిరపు పనియంతయు ముగించెను.
41
రెండు స్తంభములను, ఆ రెండు స్తంభముల మీదనున్న పైపీటల పళ్లెములను ఆ స్తంభములను పై పీటల పళ్లెములను కప్పిన రెండు అల్లికలను,
42
ఆ స్తంభముల మీదనున్న పైపీటల రెండు పళ్లెములను కప్పిన అల్లిక యొక్కటింటికి రెండు వరుసలచొప్పున రెండు అల్లికలకును నాలుగు వందల దానిమ్మపండ్లను,
43
పది స్తంభ ములను, స్తంభములమీద పది తొట్లను,
44
ఒక సముద్ర మును, సముద్రముక్రింద పండ్రెండు ఎడ్లను,
45
బిందెలను, చేటలను, గిన్నెలను వీటినన్నిటిని రాజైనసొలొమోను ఆజ్ఞనుబట్టి హీరాము హషేం మందిరమునకు చేసెను. ఈ వస్తువులన్నియు మెరుగుపెట్టిన యిత్తడివై యుండెను.
46
యొర్దాను మైదానమందు సుక్కోతునకును సారెతాను నకును మధ్య జిగట భూమియందు రాజు వాటిని పోత పోయించెను.
47
అయితే ఈ ఉపకరణములు అతివిస్తారము లైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేసెను;ఇత్తడియొక్క యెత్తు ఎంతైనది తెలియబడకపోయెను.
48
మరియు సొలొమోను హషేం మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటిని చేయించెను, అనగా బంగారపు బలిపీఠమును సముఖపు రొట్టెలనుంచు బంగారపు బల్లలను,
49
గర్భాలయము ముందర కుడిపార్శ్వమున అయి దును, ఎడమ పార్శ్వమున అయిదును, పది బంగారపు దీపస్తంభములను, బంగారపు పుష్పములను, ప్రమిదెలను, కారులను,
50
మేలిమి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూపకలశములను, అంతర్మందిరమను అతి పరి శుద్ధమైన స్థలముయొక్క తలుపులకును మందిరమను ఆల యపు తలుపులకును కలిగిన బంగారపు బందులను, వీటన్ని టిని చేయించెను,