Logo

Aliyah 2 - Deuteronomy 26:12 - 26:15

12
పదియవ భాగమిచ్చు సంవత్సరమున, అనగా మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో పదియవ వంతును చెల్లించి, అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేనివారికిని విధవ రాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తిపొందినతరు వాత
13
నీవు నీ దేవుడైన హషేం సన్నిధినినీవు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా యింటనుండి ప్రతిష్టితమైనదానిని తీసివేసి, లేవీయుల కును పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును నేనిచ్చియున్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మరచిపోలేదు.
14
నేను దుఃఖములోనుండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనై యుండగా దానిలో దేనిని తీసివేయలేదు, చనిపోయినవారి విషయమై దానిలో ఏదియు నేనియ్య లేదు, నా దేవుడైన హషేం మాట విని నీవు నా కాజ్ఞాపించినట్లు సమస్తము జరిపి యున్నాను.
15
నీ పరిశుద్ధాలయమగు ఆకాశములోనుండి చూచి, నీ జనులైన ఇశ్రాయేలీయులనుపాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమా ణము చేసినట్లు మాకిచ్చియున్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను.