Aliyah 4 - Deuteronomy 18:6 - 18:13
6
ఒక లేవీయుడు ఇశ్రాయేలీయుల దేశమున తాను విదేశిగా నివసించిన నీ గ్రామములలో ఒకదానినుండి హషేం ఏర్పరచుకొను స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు
7
అక్కడ హషేం సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపువారు చేయునట్లు అతడు తన దేవుడైన హషేం నామమున సేవచేయవలెను.
8
అమ్మబడిన తన పిత్రార్జితమువలన తనకు వచ్చినది గాక అతడు ఇతరులవలె వంతు అనుభవింపవలెను.
9
నీ దేవుడైన హషేం నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు.
10
తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకు నముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను
11
కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.
12
వీటిని చేయు ప్రతివాడును హషేంకు హేయుడు. ఆ హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన హషేం నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.
13
నీవు నీ దేవుడైన హషేంయొద్ద యథార్థపరుడవై యుండవలెను.