Logo

Aliyah 5 - Deuteronomy 14:22 - 14:29

22
ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను.
23
నీ దినము లన్నిటిలో నీ దేవుడైన హషేంకు నీవు భయపడ నేర్చుకొనునట్లు నీ దేవుడైన హషేం తన నామము నకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలోగాని నీ ద్రాక్షారసములోగాని నీ నూనెలోగాని పదియవ పంతును, నీ పశువులలోగాని గొఱ్ఱె మేకలలోగాని తొలిచూలు వాటిని తినవలెను.
24
మార్గము దీర్ఘముగానున్నందున, అనగా హషేం తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరముగా నున్నందున, నీవు వాటిని మోయ లేనియెడల నీ దేవుడైన హషేం నిన్ను ఆశీర్వదించు నప్పుడు, వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని,
25
నీ దేవుడైన హషేం యేర్పరచుకొను స్థలము నకు వెళ్లి నీవు కోరు దేనికైనను
26
ఎద్దులకేమి గొఱ్ఱెల కేమి ద్రాక్షారసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండి నిచ్చి, అక్కడ నీ దేవుడైన హషేం సన్నిధిని భోజనముచేసి, నీవును నీ యింటివారును నీ యింటనుండు లేవీయులును సంతోషింపవలెను.
27
లేవీ యులను విడువ కూడదు; నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు.
28
నీ దేవుడైన హషేం నీవు చేయు నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు మూడేసి సంవత్సర ముల కొకసారి, ఆ యేట నీకు కలిగిన పంటలో పదియవ వంతంతయు బయటికి తెచ్చి నీ యింట ఉంచవలెను.
29
అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్య మైనను లేని లేవీ యులును, నీ యింటనున్న పరదేశులును, తండ్రిలేనివారును, విధవరాండ్రును వచ్చి భోజనముచేసి తృప్తిపొందుదురు.