Aliyah 2 - Deuteronomy 12:11 - 12:28
11
నేను మికాజ్ఞా పించు సమస్త మును, అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు హషేంకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కు బళ్లను మీ దేవుడైన హషేం తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థల మునకే మీరు తీసికొని రావలెను.
12
మీరు, మీ కుమా రులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు, మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ యిండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన హషేం సన్నిధిని సంతోషింపవలెను.
13
నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహనబలులను అర్పింపకూడదు సుమీ.
14
హషేం నీ గోత్రములలో ఒకదానియందు ఏర్పరచుకొను స్థలముననే నీ దహనబలులను అర్పించి నేను మీకా జ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను.
15
అయితే నీ దేవుడైన హషేం నిన్ను ఆశీర్వదించినకొలది యిండ్ల న్నిటిలో నీ మనస్సు కోరుదానిని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రు లేమి యెఱ్ఱజింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును.
16
మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలె నేలమీద పారబోయవలెను.
17
నీ ధాన్యములో నేమి నీ ద్రాక్షారసములోనేమి నీ నూనెలోనేమి దశమభాగమును, నీ గోవులలోనిదేమి నీ గొఱ్ఱె మేకల మందలోని దేమి తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొను మ్రొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్చా éర్పణమును ప్రతిష్ఠార్పణమును నీ యింట తినక
18
నీ దేవు డైన హషేం ఏర్పరచుకొను స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ యింట నుండు లేవీయులు, కలిసికొని నీ దేవుడైన హషేం సన్నిధిని తిని, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన హషేం సన్నిధిని సంతోషించుదువు.
19
నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడువ కూడదు సుమీ.
20
నీ దేవుడైన హషేం తాను నీకిచ్చిన మాటచొప్పున నీ సరిహద్దులను విశాలపరచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినెదననుకొందువు. అప్పుడు నీకిష్టమైన మాంసము తినవచ్చును.
21
నీ దేవుడైన హషేం తన నామమును ప్రకటించుటకు ఏర్పరచు కొను స్థలము మీకు దూర ముగా ఉండిన యెడల
22
హషేం నీకిచ్చిన గోవులలోనిదేగాని మీ గొఱ్ఱె మేకలలోనిదేగాని నేను నీ కాజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించినదాని నీ యింట తినవచ్చును. జింకను దుప్పిని తినునట్లు దాని తినవచ్చును. పవిత్రాపవిత్రులు భేదము లేకుండ తినవచ్చును.
23
అయితే రక్తమును తిననే తిన కూడదు. భద్రము సుమీ. ఏలయనగా రక్తము ప్రాణము; మాంసముతో ప్రాణాధారమైనదాని తినకూడదు;
24
నీవు దాని తినక భూమిమీద నీళ్లవలె పారబోయవలెను.
25
నీవు హషేం దృష్టికి యుక్తమైనదానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతివారికి మేలుకలుగునట్లు దాని తినకూడదు.
26
నీకు నియమింపబడిన ప్రతిష్టితములను మ్రొక్కుబళ్లను మాత్రము హషేం ఏర్పరచుకొను స్థలమునకు నీవు తీసికొని పోవలెను.
27
నీ దహనబలులను వాటి రక్తమాంసములను నీ దేవుడైన హషేం బలిపీఠము మీద అర్పింపవలెను. నీ బలుల రక్తమును నీ దేవుడైన హషేం బలిపీఠముమీద పోయవలెను; వాటి మాంసము నీవు తినవలెను.
28
నీ దేవుడైన హషేం దృష్టికి యుక్త మును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతివారికిని నిత్యము మేలుకలుగునట్లు నేను నీకాజ్ఞాపించుచున్న యీ మాటలన్నిటిని నీవు జాగ్ర త్తగా వినవలెను.