Aliyah 1 - Deuteronomy 11:26 - 12:10
11:26
చూడుడి; నేడు నేను మీ యెదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను.
11:27
నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన హషేం ఆజ్ఞలను మీరు వినినయెడల దీవెనయు, మీరు మీ దేవుడైన హషేం ఆజ్ఞలను వినక
11:28
నేడు నేను మికాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని యితర దేవతలను అనుస రించిన యెడల శాపమును మీకు కలుగును.
11:29
కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన హషేం నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండమీద ఆ దీవెన వచనమును, ఏబాలుకొండ మీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను.
11:30
అవి యొర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూరవృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి గదా.
11:31
మీరు చేరి మీ దేవుడైన హషేం మీకిచ్చు చున్న దేశమును స్వాధీన పరచుకొనుటకు ఈ యొర్దానును దాటబోవుచున్నారు. మీరు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించెదరు.
11:32
అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటిని విధులన్నిటిని మీరు అనుసరించి గైకొనవలెను.
12:1
మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన హషేం నీ కిచ్చిన దేశమున మీరు భూమిమీద బ్రదుకు దినములన్నిటను మీరు అను సరించి గైకొనవలసిన కట్టడలును విధులును ఇవి.
12:2
మీరు స్వాధీనపరచుకొన బోవు జనములు గొప్ప పర్వతముల మీద నేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటిక్రిందనేమి, యెక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలము లన్నిటిని మీరు బొత్తిగా పాడుచేయవలెను.
12:3
వారి బలి పీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండ నశింప జేయవలెను.
12:4
వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన హషేంను గూర్చి చేయకూడదు.
12:5
మీ దేవుడైన హషేం మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్ప రచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయు చుండవలెను.
12:6
అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్టితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణ ములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొఱ్ఱె మేకలలోను తొలిచూలు వాటిని తీసికొని రావలెను.
12:7
మీరును మీ దేవుడైన హషేం మిమ్మునాశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములును మీ దేవుడైన హషేం సన్నిధిని భోజనముచేసి మీ చేతిపనులన్నిటి యందు సంతోషింపవలెను.
12:8
నేడు మనమిక్కడ చేయు చున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్త మైన దంతయు చేయకూడదు.
12:9
నీ దేవుడైన హషేం నీ కిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు.
12:10
మీరు యొర్దాను దాటి మీ దేవుడైన హషేం మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టునుండు శత్రువు లందరు లేకుండ మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందునప్పుడు