Aliyah 4 - Deuteronomy 10:1 - 10:11
1
ఆ కాలమందు హషేంమునుపటి వాటి వంటి రెండు రాతిపలకలను నీవు చెక్కుకొని కొండ యెక్కి నా యొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కఱ్ఱమందసమును చేసికొనవలెను.
2
నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకలమీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను.
3
కాబట్టి నేను తుమ్మకఱ్ఱతో ఒక మందసమును చేయించి మునుపటి వాటివంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేత పట్టుకొని కొండ యెక్కితిని.
4
ఆ సమాజదినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు హషేం ఆ పలకలమీద వ్రాసెను. హషేం వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగివచ్చి
5
నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని. హషేం నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని.
6
ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతునుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకు డాయెను.
7
అక్కడనుండి వారు గుద్గోదకును గుద్గోద నుండి నీటివాగులు గల దేశమైన యొత్బాతాకును ప్రయా ణము చేసిరి.
8
నేటివరకు జరుగునట్లు హషేం నిబంధన మందసమును మోయుటకు, హషేం సన్నిధిని నిలు చుటకును, ఆయనను సేవించి ఆయన నామమునుబట్టి దీవించుటకును, లేవి గోత్రపువారిని ఆ కాలమున హషేం ఏర్పరచుకొనెను.
9
కాబట్టి తమ సహో దరులతోపాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొంద లేదు. నీ దేవుడైన హషేం వారితో చెప్పినట్లు హషేంయే వారికి స్వాస్థ్యము.
10
నేను మునుపటివలె నలువది పగళ్లును నలువది రాత్రులును కొండమీద ఉండగా హషేం ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింప జేయుట మానివేసెను.
11
మరియు హషేం నాతో ఇట్లనెనుఈ ప్రజలు నేను వారికిచ్చెదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీన పరచుకొనునట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను.