Logo

Aliyah 3 - Deuteronomy 4:41 - 4:49

41
అంతకుముందొకడు పగపట్టక పరాకున తన పొరుగు వాని చంపినయెడల
42
చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పుదిక్కున, యొర్దాను ఇవతల మూడు పురములను వేరుపరచెను. అట్టివాడెవడైనను ఆ పురములలో దేని లోనికినైనను పారిపోయి బ్రదుకును.
43
అవేవనగా రూబే నీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీ యులకు గిలాదులో నున్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే.
44
మోషే ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రము ఇది.
45
ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వెలుపలికి వచ్చు చుండగా
46
యొర్దాను ఇవతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోనులో నివసించిన అమోరీ యుల రాజైన సీహోనుదేశమందు
47
మోషే ఇశ్రాయేలీయులకు నియ మించిన శాసనములు కట్టడలు న్యాయ విధులు ఇవి.
48
మోషేయు ఇశ్రాయేలీయులును ఐగుప్తులోనుండి వచ్చుచు ఆ సీహోనును హతము చేసి అతని దేశమును, యొర్దాను ఇవతల ఉదయదిక్కున నున్న బాషాను రాజైన ఓగుయొక్క దేశమును, అర్నోను ఏటి దరినున్న అరోయేరు మొదలుకొని హెర్మోనను సీయోను కొండవరకున్న అమో రీయుల యిద్దరు రాజులదేశమును,
49
పిస్గా యూటలకు దిగువగా అరాబా సముద్రమువరకు తూర్పుదిక్కున యొర్దాను అవతల ఆరాబా ప్రదేశమంతయు స్వాధీన పరచు కొనిరి.