Logo

Aliyah 1 - Deuteronomy 3:23 - 4:4

3:23
మరియు ఆ కాలమున నేనుహషేం ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి యున్నావు.
3:24
ఆకాశమందే గాని భూమి యందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవు డెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవు డెవడు?
3:25
నేను అద్దరికి వెళ్లి యొర్దాను అవతలనున్న యీ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను హషేంను బ్రతిమాలుకొనగా
3:26
హషేం మిమ్మును బట్టి నామీద కోప పడి నా మనవి వినకపోయెను. మరియు హషేం నాతో ఇట్లనెనుచాలును; ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు.
3:27
నీవు ఈ యొర్దానును దాట కూడదు గాని నీవు పిస్గాకొండయెక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తరవైపును దక్షిణవైపును తూర్పువైపును తేరి చూడుము.
3:28
యెహోషువకు ఆజ్ఞయిచ్చి అతని ధైర్యపరచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నదిదాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీన పరచుకొనచేయును.
3:29
అప్పుడు మనము బేత్పయోరు యెదుటనున్న లోయలో దిగియుంటిమి.
4:1
కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పిత రుల దేవుడైన హషేం మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు, మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి.
4:2
మీ దేవుడైన హషేం ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు.
4:3
బయల్పెయోరు విషయ ములో హషేం చేసినదానిని మీరు కన్నులార చూచితిరి గదా. బయల్పెయోరు వెంట వెళ్లిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన హషేం నీ మధ్యను ఉండకుండ నాశనము చేసెను.
4:4
మీ దేవుడైన హషేంను హత్తుకొనిన మీరందరును నేటివరకు సజీవులై యున్నారు.