Logo

Aliyah 1 - Numbers 25:10 - 26:4

25:10
అప్పుడు హషేం మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుయాజకుడైన అహరోను మనుమ డును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,
25:11
వారి మధ్యను నేను ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుటవలన ఇశ్రాయేలీయుల మీదనుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు.
25:12
కాబట్టి నీవు అతనితో ఇట్లనుము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను.
25:13
అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును; ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రా యేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.
25:14
చంప బడిన వాని పేరు జిమీ, అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధానియైన సాలూ కుమారుడు.
25:15
చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధానియై యుండెను.
25:16
మరియు హషేం మోషేకు ఈలాగు సెలవిచ్చెను మిద్యానీయులు తమ తంత్రములవలన మీకు బాధకులై యున్నారు; వారిని బాధపెట్టి హతము చేయుడి;
25:17
వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను,
25:18
తెగులు దిన మందు పెయోరు విషయములో చంపబడిన తమ సహో దరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బీ సంగతిలోను, మిమ్మును మోసపుచ్చిరి.
26:1
ఆ తెగులు పోయిన తర్వాత హషేం మోషే కును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు కును ఈలాగు సెలవిచ్చెను
26:2
మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజములోను ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలు వెళ్లువారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి.
26:3
కాబట్టి యిరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని లెక్కింపుడని హషేం మోషేకును ఐగుప్తుదేశమునుండి వచ్చిన ఇశ్రా యేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు
26:4
మోయాబు మైదానము లలో యెరికోయొద్దనున్న యొర్దాను దగ్గర నుండగా జన సంఖ్యను చేయుడని వారితో చెప్పిరి.