Aliyah 1 - Numbers 13:1 - 13:20
1
హషేం మోషేకు ఈలాగున సెలవిచ్చెను
2
నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనానుదేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను.
3
మోషే హషేం మాట విని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు.
4
వారి పేళ్లు ఏవనగారూబేను గోత్ర మునకు
5
జక్కూరు కుమారుడైన షమ్మూయ; షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు;
6
యూదా గోత్రమునకు యెఫున్నె కుమారు డైన కాలేబు;
7
ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు;
8
ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ;
9
బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ;
10
జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు;
11
యోసేపు గోత్రమునకు, అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ;
12
దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమీ్మయేలు;
13
ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు;
14
నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ;
15
గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి.
16
దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.
17
మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపి నప్పుడు వారితో ఇట్లనెనుమీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో
18
దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో
19
వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారము లలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో,
20
దానిలో చెట్లు న్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము