Aliyah 7 - Numbers 7:72 - 7:89
72
పదకొండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడునైన పగీయేలు.
73
అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని
74
ధూపద్రవ్యముతో నిండి యున్న పది తులముల బంగారు ధూపార్తిని
75
దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును
76
ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను
77
సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము.
78
పండ్రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీర.
79
అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తుల ముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని
80
ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తినిఒ దహనబలిగా ఒక చిన్నకోడెను
81
ఒకపొట్టె లును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను
82
అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఏనాను కుమారుడైన అహీర అర్పణము.
83
బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠార్పణములు ఇవి, వెండి గిన్నెలు పండ్రెండు, వెండి ప్రోక్షణపాత్రలు పండ్రెండు, బంగారు ధూపార్తులు పండ్రెండు, ప్రతి వెండిగిన్నె నూట ముప్పది తులములది.
84
ప్రతి ప్రోక్షణపాత్ర డెబ్బది తులములది; ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుధ్ద మైన తులపు పరిమాణ మునుబట్టి రెండు వేల నాలుగువందల తులములది.
85
ధూపద్రవ్యముతో నిండిన బంగారు ధూపా ర్తులు పండ్రెండు; వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి పది తులములది.
86
ఆ ధూపార్తుల బంగారమంతయు నూట ఇరువది తులములది; దహనబలి పశువులన్నియు పండ్రెండు కోడెలు, పొట్టేళ్లు పండ్రెండు, ఏడాదివైన గొఱ్ఱెపిల్లలు పండ్రెండు, వాటి నైవేద్యములును పాపపరిహారార్థమైన మగమేకపిల్లలు పండ్రెండు,
87
సమా ధానబలి పశువులన్నియు ఇరువది నాలుగు కోడెలు,
88
పొట్టేళ్లు అరువది, మేకపోతులు అరువది, ఏడాదివైన గొఱ్ఱెపిల్లలు అరువది.
89
మోషే హషేంతో మాట లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లినప్పుడు సాక్ష్యపు మందసము మీద నున్న కరుణాపీఠముమీద నుండి, అనగా రెండు కెరూబుల నడమనుండి తనతో మాటలాడిన హషేం స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాటలాడెను.