Logo

Aliyah 3 - Deuteronomy 15:19 - 15:23

19
నీ గోవులలో నేమి నీ గొఱ్ఱె మేకలలోనేమి తొలి చూలు ప్రతి మగదానిని నీ దేవుడైన హషేంకు ప్రతిష్ఠింపవలెను. నీ కోడెలలో తొలిచూలు దానితో పనిచేయకూడదు. నీ గొఱ్ఱె మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు.
20
హషేం యేర్పరచు కొను స్థలమున నీవును నీ యింటివారును నీ దేవుడైన హషేం సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తిన వలెను.
21
దానిలో లోపము, అనగా దానికి కుంటితనమై నను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండినయెడల నీ దేవుడైన హషేంకు దాని అర్పింపకూడదు.
22
జింకను దుప్పిని తినునట్లు నీ పురములలో పవిత్రాపవిత్రులు దాని తినవచ్చును.
23
వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. నీళ్లవలె భూమిమీద దాని పార బోయవలెను.