Aliyah 5 - Numbers 3:14 - 3:39
14
మరియు సీనాయి అరణ్యమందు హషేం మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
15
లేవీయుల పితరుల కుటుంబ ములను వారివారి వంశములను లెక్కింపుము. ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారినందరిని లెక్కింప వలెను.
16
కాబట్టి మోషే హషేం తనకు ఆజ్ఞాపించి నట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను.
17
లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.
18
గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమీ అనునవి.
19
కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి.
20
మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మాహలి మూషి. వారివారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు.
21
లిబ్నీ యులు షిమీయులు గెర్షోను వంశస్థులు గెర్షోనీయుల వంశపువారు వీరే.
22
వారిలో లెక్కింప బడినవారు అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరిలో లెక్కింపబడినవారు ఏడువేల ఐదువందల మంది.
23
గెర్షోనీ యుల వంశములు మందిరము వెనుకను, అనగా పడమటి దిక్కున దిగవలెను.
24
గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలీయాసాపు ప్రధానుడు.
25
ప్రత్య క్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసిన వేవనగా, మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు
26
ప్రాకారయౌవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టునున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవకొరకైన త్రాళ్లును.
27
కహాతు వంశమేదనగా, అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జీయేలీ యుల వంశము; ఇవి కహాతీయుల వంశములు.
28
ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరి లెక్క చూడగా ఎనిమిదివేల ఆరువందలమంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసినవారైరి.
29
కహాతు కుమారుల వంశములు మందిరముయొక్క ప్రక్కను, అనగా దక్షిణదిక్కున దిగవలసినవారు.
30
కహాతీయుల వంశముల పితరుల కుటుంబ మునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను.
31
వారు మందసము బల్ల దీపవృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధస్థలములోని ఉపకరణములు అడ్డ తెరయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసినవారు.
32
యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధస్థలమును కాపాడు వారిమీద విచారణకర్త.
33
మెరారి వంశమేదనగా, మహలీయుల వంశము మూషీయుల వంశము; ఇవి మెరారి వంశములు.
34
వారిలో లెక్కింపబడినవారెందరనగా, ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరు ఆరువేల రెండువందల మంది.
35
మెరారీయుల పితరుల కుటుంబములో అబీహా యిలు కుమారుడైన సూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తరదిక్కున దిగవలసినవారు.
36
మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణము లన్నిటిని దాని సేవకొరకైనవన్నిటిని
37
దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను కాపాడవలసినవారు.
38
మందిరము ఎదుటి తూర్పుదిక్కున, అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదిశయందు దిగవలసినవారు మోషే అహరోనులు అహరోను కుమారులు; ఇశ్రాయేలీయులు కాపాడ వలసిన పరిశుద్ధస్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించినయెడల అతడు మరణశిక్ష నొందును.
39
మోషే అహరోనులు హషేం మాటను బట్టి, తమ తమ వంశ ములచొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరు, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరు ఇరువది రెండువేలమంది.