Aliyah 1 - Leviticus 25:1 - 25:18
1
మరియు హషేం సీనాయికొండమీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను
2
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్ల నుమునేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమికూడ హషేం పేరట విశ్రాంతి కాలమును, ఆచరింపవలెను.
3
ఆరు సంవత్సరములు నీ చేను విత్తవలెను. ఆరు సంవత్సరములు నీ ఫలవృక్ష ములతోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును.
4
ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము, అనగా హషేం పేరట విశ్రాంతి సంవత్సర ముగా ఉండవలెను. అందులో నీ చేను విత్త కూడదు; నీ ఫలవృక్షములతోటను శుద్ధిపరచకూడదు.
5
నీ కారుచేల పంటను కోసికొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్షఫలములను ఏరుకొనకూడదు; అది భూమికి విశ్రాంతి సంవత్సరము.
6
అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివ సించు పరదేశికిని ఆహారమగును.
7
మరియు నీ పశువుల కును నీ దేశజంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును.
8
మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను, అనగా ఏడేసి యేండ్లుగల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ యేడు విశ్రాంతి సంవత్సరములకాలము నలుబది తొమ్మిది సంవత్సరములగును.
9
ఏడవ నెల పది యౌవనాడు మీ స్వదేశమంతట శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చి త్తార్థదినమున మీ దేశమంతట ఆ శృంగనాదము చేయవలెను.
10
మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్స రమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; అది మీకు సునాదముగా నుండును; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను.
11
ఆ సంవత్సరము, అనగా ఏబదియవ సంవత్స రము మీకు సునాదకాలము. అందులో మీరు విత్త కూడదు కారుపంటను కోయకూడదు శుద్ధిపరచని నీ ఫల వృక్షముల పండ్లను ఏరుకొనకూడదు.
12
అది సునాద కాలము; అది మీకు పరిశుద్ధమగును, పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు.
13
ఆ సునాద సంవ త్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరల పొందవలెను.
14
నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములోకాని నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో కాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు.
15
సునాద సంవత్సరమైన తరువాత గడచిన యేండ్ల లెక్క చొప్పున నీ పొరుగు వానియొద్ద నీవు దానిని కొనవలెను. పంటల లెక్కచొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను.
16
ఆ సంవత్సరముల లెక్క హెచ్చినకొలది దాని వెల హెచ్చింపవలెను, ఆ సంవత్సరముల లెక్క తగ్గినకొలది దాని వెల తగ్గింపవలెను. ఏలయనగా పంటల లెక్కచొప్పున అతడు దాని నీకు అమ్మును గదా.
17
మీరు ఒకరి నొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడనైన హషేంను.
18
కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటి ననుసరించి నడుచుకొనవలెను.