Logo

Aliyah 5 - Leviticus 10:16 - 10:20

16
అప్పుడు మోషే పాపపరిహారార్థబలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెదకినప్పుడు అది కాలిపోయి యుండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారను వారిమీద ఆగ్రహపడి
17
మీరు పరిశుద్ధస్థలములో ఆ పాపపరిహారార్థబలిపశువును ఏల తినలేదు? అది అతిపరిశుద్ధముగదా. సమాజము యొక్క దోషశిక్షను భరించి హషేం సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను గదా.
18
ఇదిగో దాని రక్తమును పరిశుద్ధస్థలము లోనికి తేవలెను గదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయ ముగా పరిశుద్ధస్థలములో దానిని తినవలెనని చెప్పెను.
19
అందుకు అహరోను మోషేతోఇదిగో నేడు పాప పరిహారార్థ బలిపశువును దహనబలిద్రవ్యమును హషేం సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాపపరిహారార్థమైన బలిద్రవ్యమును నేడు తినిన యెడల అది హషేం దృష్టికి మంచిదగునా అనెను.
20
మోషే ఆ మాట విని ఒప్పుకొనెను.