అలియా 1 - Leviticus 6:1 - 6:11
1
మరియు హషేం మోషేకు ఈలాగు సెలవిచ్చెను
2
నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనుము ఇది దహనబలినిగూర్చిన విధి. దహనబలిద్రవ్యము ఉద యమువరకు రాత్రి అంతయు బలిపీఠముమీద దహించు చుండును; బలిపీఠముమీది అగ్ని దానిని దహించు చుండును.
3
యాజకుడు తన సన్ననార నిలువుటంగీని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగు కొని బలిపీఠముమీద అగ్ని దహించు దహనబలిద్రవ్యపు బూడిదెను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి
4
తన వస్త్ర ములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపలనున్న పవిత్రస్థలమునకు ఆ బూడిదెను తీసికొనిపోవలెను.
5
బలిపీఠముమీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలువేసి, దానిమీద దహనబలిద్రవ్యమును ఉంచి, సమాధానబలియగు పశువు క్రొవ్వును దహింపవలెను.
6
బలిపీఠముమీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు.
7
నైవేద్యమునుగూర్చిన విధి యేదనగా, అహరోను కుమారులు హషేం సన్నిధిని బలిపీఠము నెదుట దానిని నర్పించవలెను.
8
అతడు నైవేద్యతైలమునుండియు దాని గోధుమపిండినుండియు చేరెడు పిండిని నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దాని లోనుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠముమీద హషేంకు ఇంపైన సువాసనగాను దహింపవలెను.
9
దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతివారును తినవలెను. అది పులియనిదిగా పరి శుద్ధస్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను;
10
దాని పులియబెట్టి కాల్చవలదు; నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాని నిచ్చియున్నాను. పాపపరిహారార్థబలివలెను అపరాధపరిహారార్థబలివలెను అది అతిపరిశుద్ధము.
11
అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది హషేం హోమముల విషయ ములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును.