Logo

Aliyah 5 - Exodus 34:1 - 34:9

1
మరియు హషేం మోషేతోమొదటి పలకల వంటి మరి రెండు రాతిపలకలను చెక్కుము. నీవు పగుల గొట్టిన మొదటి పలకలమీదనున్న వాక్యములను నేను ఈ పలకలమీద వ్రాసెదను.
2
ఉదయము నకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండయెక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచియుండవలెను.
3
ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు; ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనను కనబడకూడదు; ఈ కొండయెదుట గొఱ్ఱెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను.
4
కాబట్టి అతడు మొదటి పలకలవంటి రెండు రాతిపలకలను చెక్కెను. మోషే తనకు హషేం ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతిపలకలను చేతపట్టుకొని సీనాయికొండ యెక్కగా
5
మేఘములో హషేం దిగి అక్కడ అతనితో నిలిచి హషేం అను నామమును ప్రకటించెను.
6
అతనియెదుట హషేం అతని దాటి వెళ్లుచుహషేం కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన హషేం.
7
ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించు నని ప్రకటించెను.
8
అందుకు మోషే త్వరపడి నేలవరకు తలవంచుకొని నమస్కారముచేసి
9
ప్రభువా, నామీద నీకు కటాక్షము కలిగినయెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతోకూడ రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును పాపమున