Aliyah 7 - Exodus 27:9 - 27:19
9
మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్న నార యౌవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.
10
దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి; ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.
11
అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడుగుగల యౌవనికలుండ వలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి.
12
పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏబది మూరల యౌవనికలుండవలెను; వాటి స్తంభ ములు పది వాటి దిమ్మలు పది.
13
తూర్పువైపున, అనగా ఉదయదిక్కున ఆవరణపు వెడల్పు ఏబది మూరలు.
14
ఒక ప్రక్కను పదునైదు మూరల యౌవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.
15
రెండవ ప్రక్కను పరునైదుమూరల యౌవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలును మూడు.
16
ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల యిరువది మూరల తెర యుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను; వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు.
17
ఆవరణముచుట్టున్న స్తంభములన్నియు వెండి పెండెబద్దలు కలవి; వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి.
18
ఆవరణపు పొడుగు నూరు మూరలు; దాని వెడల్పు ఏబదిమూరలు దాని యెత్తు అయిదు మూరలు; అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడివి.
19
మందిరసంబంధమైన సేవోపకర ణములన్నియు మేకులన్నియు ఆవరణపు మేకులన్నియు ఇత్తడివై యుండవలెను.