Aliyah 7 - Exodus 20:15 - 20:23
15
దొంగిలకూడదు.
16
నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
17
నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను.
18
ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి.
19
నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడిన యెడల మేము చనిపోవుదుము
20
అందుకు మోషే - భయపడకుడి; మిమ్ము పరీక్షించుటకును, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును, దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను.
21
ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా
22
హషేం మోషేతో ఇట్లనెను - ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము నేను ఆకాశమునుండి మీతో మాటలాడితినని మీరు గ్రహించితిరి.
23
మీరు నన్ను కొలుచుచు, వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు.