Aliyah 6 - Exodus 19:20 - 20:14
19:20
హషేం సీనాయి పర్వతముమీదికి, అనగా ఆ పర్వత శిఖరముమీదికి దిగి వచ్చెను. హషేం పర్వత శిఖరముమీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను
19:21
అప్పుడు హషేంప్రజలు చూచుటకు హషేం యొద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము.
19:22
మరియు హషేం వారిమీద పడకుండునట్లు హషేంయొద్దకు చేరు యాజకులు తమ్ముతామే పరిశుద్ధ పరచుకొన వలెనని మోషేతో చెప్పగా
19:23
మోషే హషేంతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేరలను ఏర్పరచి దాని పరిశుద్ధపరచ వలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను.
19:24
అందుకు హషేంనీవు దిగి వెళ్లుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే హషేం వారి మీద పడకుండునట్లు యాజకులును ప్రజలును ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు; ఆయన వారిమీద పడునేమో అని అతనితో చెప్పగా
19:25
మోషే ప్రజలయొద్దకు వెళ్లి ఆ మాట వారితో చెప్పెను.
20:1
దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.
20:2
నీ దేవుడనైన హషేంను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని;
20:3
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
20:4
పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
20:5
ఏలయనగా నీ దేవుడనైన హషేంనగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు
20:6
నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యి తరములవరకు కరుణించు వాడనై యున్నాను.
20:7
నీ దేవుడైన హషేం నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; హషేం తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు.
20:8
విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.
20:9
ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను
20:10
ఏడవ దినము నీ దేవుడైన హషేంకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు.
20:11
ఆరు దినములలో హషేం ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను; అందుచేత హషేం విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.
20:12
నీ దేవుడైన హషేం నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
20:13
నరహత్య చేయకూడదు.
20:14
వ్యభిచరింపకూడదు.