Maftir - Exodus 17:14-17:16
14
అప్పుడు హషేం మోషేతో నిట్లనెనునేను అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచి వేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంధములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము.
15
తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి హషేం నిస్సీ అని పేరు పెట్టి
16
అమాలేకీయులు తమచేతిని హషేం సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక హషేంకు అమాలేకీయులతో తరతరములవరకు యుద్ధమనెను.