అలియా 5 - Exodus 8:7 - 8:18
7
అనగా కప్పలు నీ యొద్ద నుండియు నీ యిండ్లలో నుండియు నీ సేవకుల యొద్ద నుండియు నీ ప్రజలయొద్దనుండియు తొలగి పోవును; అవి యేటిలోనే ఉండుననెను.
8
మోషే అహరోనులు ఫరో యొద్దనుండి బయలు వెళ్లినప్పుడు హషేం ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతనికొరకు మొఱ పెట్టగా
9
హషేం మోషే మాటచొప్పున చేసెను గనుక ఇండ్లలో నేమి వెలుపల నేమి పొలములలో నేమి కప్పలు ఉండకుండ చచ్చిపోయెను.
10
జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపుకొట్టెను.
11
ఫరో ఉపశమనము కలుగుట చూచి హషేం సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినక పోయెను.
12
అందుకు హషేం మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమందంత టను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి.
13
అహరోను తన కఱ్ఱను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యులమీదను జంతువులమీదను ఉండెను; ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను¸
14
శకునగాండ్రు కూడ పేలను పుట్టించవలెనని తమ మంత్రములచేత అట్లు చేసిరి గాని అది వారివలన కాకపోయెను. పేలు మను ష్యులమీదను జంతువులమీదను ఉండగా
15
శకునగాండ్రుఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే హషేం చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారిమాట వినకపోయెను.
16
కాబట్టి హషేం మోషేతొ నీవు ప్రొద్దున లేచి ఫరో యెదుట నిలువుము, ఇదిగో అతడు ఏటియొద్దకు పోవును. నీవు అతని చూచినన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము.
17
నీవు నా ప్రజలను పోనియ్యని యెడల చూడుము నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజలమీదికిని నీ యిండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను; ఐగుప్తీ యుల యిండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును.
18
మరియు భూలోకములో నేనే హషేంను అని నీవు తెలిసికొనునట్లు, ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెనుదేశమును వినాయించెదను, అక్కడ ఈగలగుంపు లుండవు.