Logo

Aliyah 4 - Genesis 45:19 - 45:27

19
నీకు ఆజ్ఞయైనది గదా? దీని చేయుడి, మీ పిల్లల కొరకును మీ భార్యలకొరకును ఐగుప్తులోనుండి బండ్లను తీసికొనిపోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి.
20
ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామగ్రిని లక్ష్యపెట్టకుడని చెప్పుమనగా
21
ఇశ్రాయేలు కుమారులు ఆలాగుననే చేసిరి. యోసేపు ఫరోమాట చొప్పన వారికి బండ్లను ఇప్పించెను; మార్గమునకు ఆహారము ఇప్పించెను.
22
అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను; బెన్యా మీనుకు మూడువందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను,
23
అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో నున్న మంచి వస్తువులను మోయుచున్న పది గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును తిను బండములను మోయుచున్న పది ఆడుగాడిదలను పంపెను.
24
అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా - మార్గమందు కలహపడకుడని వారితో చెప్పెను.
25
వారు ఐగుప్తునుండి బయలు దేరి కనాను దేశమునకు తన తండ్రియైన యాకోబు నొద్దకు వచ్చి
26
యోసేపు ఇంక బ్రదికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను.
27
అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రియైన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను.