Haftarah - Amos 2:6-3:8
2:6
హషేం సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మి వేయుదురు; పాదరక్షలకొరకై బీదవారిని అమ్మి వేయుదురు.
2:7
దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు; దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు; తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధనామమును అవమానపరచుదురు;
2:8
తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలి పీఠములన్నిటియొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు.
2:9
దేవదారు వృక్షమంత యెత్తయిన వారును సిందూరవృక్షమంత బలముగల వారునగు అమోరీయులను వారిముందర నిలువకుండ నేను నాశనము చేసితిని గదా; పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసితిని గదా,
2:10
మరియు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించి, అమోరీయుల దేశమును మీకు స్వాధీనపర చవలెనని నలువది సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించితిని గదా.
2:11
మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ ¸యౌవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని. ఇశ్రాయేలీయు లారా, యీ మాటలు నిజమైనవికావా? ఇదే హషేం వాక్కు.
2:12
అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి.
2:13
ఇదిగో పంటచేని మోపుల నిండుబండి నేలను అణగ ద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును.
2:14
అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకొన జాలకపోవును, పరాక్రమశాలి తన బలమునుబట్టి ధైర్యము తెచ్చుకొన జాలక పోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును.
2:15
విలుకాడు నిలువజాలకపోవును, వడిగా పరుగెత్తువాడు తప్పించు కొనలేకపోవును, గుఱ్ఱము ఎక్కిన వాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును.
2:16
మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహు ధైర్యము గలవాడు దిగంబరియై పారిపోవును; ఇదే హషేం వాక్కు.
3:1
ఐగుప్తుదేశమునుండి హషేం రప్పించిన ఇశ్రా యేలీయులారా, మిమ్మునుగూర్చియు ఆయన రప్పించిన కుటుంబమువారినందరినిగూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి.
3:2
అదేమనగా భూమిమీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటినిబట్టి మిమ్మును శిక్షింతును.
3:3
సమ్మతింపకుండ ఇద్దరు కూడి నడుతురా?ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా?
3:4
ఏమియు పట్టు కొనకుండనే కొదమ సింహము గుహలోనుండి బొబ్బ పెట్టునా?
3:5
భూమిమీద ఒకడును ఎరపెట్టకుండ పక్షి ఉరిలో చిక్కుపడునా? ఏమియు పట్టుబడకుండ ఉరి పెట్టువాడు వదలిలేచునా?
3:6
పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? హషేం చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా?
3:7
తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ ప్రభువైన హషేం యేమియు చేయడు.
3:8
సింహము గర్జించెను, భయపడనివాడెవడు? ప్రభువైన హషేం ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండువా డెవడు?