Logo

Aliyah 7 - Genesis 36:20 - 36:43

20
ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు, లోతాను శోబాలు సిబ్యోను అనా
21
దిషోను ఏసెరు దీషాను. వీరు ఎదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు.
22
లోతాను కుమారులు హోరీ హేమీము; లోతాను సహోదరి తిమ్నా
23
శోబాలు కుమారులు అల్వాను మానహదు ఏబాలు షపో ఓనాము.
24
సిబ్యోను కుమారులు అయ్యా అనా; ఆ అనా తన తండ్రియైన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనిన వాడు.
25
అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా.
26
దిషోను కుమారులు హెవ్దూను ఎష్బాను ఇత్రాను కెరాను
27
ఏసెరు కుమారులు బిల్హాను జవాను అకాను.
28
దీషాను కుమారులు ఊజు అరాను.
29
హోరీయుల నాయకులు, లోతాను నాయకుడు శోబాలు నాయకుడు సిబ్యోను నాయకుడు అనా నాయకుడు
30
దిషోను నాయకుడు ఏసెరు నాయకుడు దీషాను నాయకుడు. శేయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు.
31
మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు, ఎదోము దేశములో రాజ్యపరిపాలన చేసినరాజు లెవరనగా
32
బెయారు కుమారుడైన బెల ఎదోములో రాజ్యపరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా
33
బెల చనిపోయిన తరువాత బొస్రా వాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయెను.
34
యోబాబు చనిపోయిన తరువాత తేమనీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను.
35
హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీతు.
36
హదదు చనిపోయిన తరువాత మశ్రేకావాడైన శమ్లా అతనికి ప్రతిగా రాజాయెను.
37
శమ్లా చనిపోయిన తరువాత నదీతీర మందలి రహెబోతువాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయెను.
38
షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌ హానాను అతనికి ప్రతిగా రాజాయెను.
39
అక్బోరు కుమారుడైన బయల్‌ హానాను చనిపోయినతరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు కుమార్తె.
40
మరియు వారివారి వంశముల ప్రకారము వారివారి స్థలములలో వారివారి పేరుల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరులేవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యతేతు నాయకుడు
41
అహొలీబామా నాయకుడు ఏలా నాయకుడు పీనోను నాయకుడు
42
కనజు నాయకుడు తేమాను నాయకుడు మిబ్సారు నాయకుడు
43
మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాసస్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూల పురుషుడు.