అలియా 3 - Genesis 32:31 - 33:5
31
యాకోబు - నేను ముఖా ముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.
32
అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను; అప్పుడతడు తొడకుంటుచు నడిచెను.
33
అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీది తుంటినరము కొట్టినందున నేటివరకు ఇశ్రాయేలీయులు తొడ గూటిమీదనున్న తుంటినరము తినరు.
1
యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును. అతనితో నాలుగువందలమంది మనుష్యులును వచ్చుచుండిరి.
2
అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి¸
3
తాను వారి ముందర వెళ్లుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడుమార్లు నేలను సాగిలపడెను.
4
అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీద పడి ముద్దుపెట్టుకొనెను; వారిద్దరు కన్నీరు విడిచిరి.
5
ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావలెనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను.