Aliyah 4 - Genesis 26:23 - 26:29
23
అక్కడనుండి అతడు బెయేర్షెబాకు వెళ్లెను.
24
ఆ రాత్రియే హషేం అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను.
25
అక్కడ అతడొక బలిపీఠము కట్టించి హషేం నామమున ప్రార్థనచేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి.
26
అంతట అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతియైన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి.
27
ఇస్సాకు - మీరు నామీద పగపట్టి మీయొద్దనుండి నన్ను పంపివేసిన తరువాత ఎందునిమిత్తము నా యొద్దకు వచ్చియున్నారని వారినడుగగా
28
వారు నిశ్చయముగా హషేం నీకు తోడైయుండుట చూచితివిు గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలె ననియు
29
మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపి వేసితివిు గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసికొందుమనియు అనుకొంటిమి; ఇప్పుడు నీవు హషేం ఆశీర్వాదము పొందిన వాడవనిరి.