Aliyah 2 - Genesis 26:6 - 26:12
6
ఇస్సాకు గెరారులో నివసించెను.
7
ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి - ఆమె యెవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను; ఎందుకనగా - రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను.
8
అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్యయైన రిబ్కాతో సరసమాడుట కనబడెను.
9
అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని యేల చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవుదు నేమో అనుకొంటినని అతనితో చెప్పెను.
10
అందుకు అబీమెలెకు నీవు మాకు చేసిన యీ పని యేమి? ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మామీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవుగదా అనెను.
11
అబీమెలెకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లు వాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజల కందరికి ఆజ్ఞాపింపగా
12
ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. హషేం అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.