Logo

Aliyah 5 - Genesis 4:19 - 4:22

19
లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనెను; వారిలో ఒక దాని పేరు ఆదా రెండవదాని పేరు సిల్లా.
20
ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు.
21
అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారికందరికిని మూలపురుషుడు.
22
మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పని ముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. తూబల్కయీను సహోదరి పేరు నయమా.