Aliyah 1 - Deuteronomy 32:1 - 32:6
1
ఆకాశమండలమా, చెవినొగ్గుము; నేను మాట లాడుదును భూమండలమా, నా నోటిమాట వినుము.
2
నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.
3
నేను హషేం నామమును ప్రకటించెదను మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి.
4
ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.
5
వారు తమ్ము చెరుపుకొనిరి; ఆయన పుత్రులుకారు; వారు కళంకులు మూర్ఖతగల వక్రవంశము.
6
బుద్ధిలేని అవివేకజనమా, ఇట్లు హషేంకు ప్రతికారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా?ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను.