Logo

జెకర్యా 1

1
దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో హషేం వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా
2
హషేం మీ పితరులమీద బహుగా కోపించెను.
3
కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు హషేం సెలవిచ్చున దేమనగామీరు నాతట్టు తిరిగినయెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు హషేం సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు హషేం వాక్కు.
4
మీరు మీ పితరులవంటివారై యుండవద్దు; పూర్వికులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు హషేం సెలవిచ్చునదేమనగామీ దుర్మార్గ తను మీ దుష్‌క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించక పోయిరి; ఇదే హషేం వాక్కు.
5
మీ పితరు లేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రదుకుదురా?
6
అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలును కట్టడలును మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగిమన ప్రవర్తననుబట్టియు క్రియలను బట్టియు హషేం మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి.
7
మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవ త్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవ దినమున హషేం వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
8
రాత్రి ఎఱ్ఱని గుఱ్ఱమునెక్కిన మనుష్యు డొకడు నాకు కనబడెను; అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడియుండగా అతని వెనుక ఎఱ్ఱని గుఱ్ఱము లును చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములును తెల్లని గుఱ్ఱము లును కనబడెను.
9
అప్పుడునా యేలినవాడా, యివి ఏమని నేనడుగగా నాతో మాటలాడు దూతఇవి ఏమి యైనది నేను నీకు తెలియజేతుననెను.
10
అప్పుడు గొంజి చెట్లలో నిలువబడియున్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు హషేం పంపించిన గుఱ్ఱములని చెప్పెను.
11
అవి గొంజిచెట్లమధ్యను నిలువబడిన హషేం దూతను చూచిమేము లోకమంతట తిరుగులాడివచ్చి యున్నాము; ఇదిగో లోకులందరు శాంతముకలిగి నిమ్మళ ముగా ఉన్నారని చెప్పెను.
12
అందుకు హషేం దూతసైన్యములకధిపతియగు హషేం, డెబ్బది సంవత్సరములనుండి నీవు యెరూషలేముమీదను యూదా పట్టణములమీదను కోపముంచియున్నావే; యిక ఎన్నాళ్లు కనికరింపకయుందువు అని మనవిచేయగా
13
హషేం నాతో మాటలాడిన దూతకు ఆదరణయైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను.
14
కాబట్టి నాతో మాటలాడు చున్న దూత నాతో ఇట్లనెను - నీవు ప్రకటన చేయ వలసినదేమనగా సైన్యములకు అధిపతియగు హషేం ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను యెరూషలేము విషయములోను సీయోనువిషయములోను అధికాసక్తి కలిగియున్నాను;
15
నిమ్మళముగా ఉన్న అన్యజనులమీద నేను బహుగా కోపించుచున్నాను; ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడుచేయవలెనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి.
16
కాబట్టి హషేం సెలవిచ్చున దేమనగావాత్సల్యముగలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగియున్నాను; అందులో నా మందిరము కట్ట బడును; యెరూషలేముమీద శిల్పకారులు నూలు సాగ లాగుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు హషేం వాక్కు.
17
నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను హషేం సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.
18
అప్పుడు నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కన బడెను.
19
ఇవి ఏమిటివని నేను నాతో మాటలాడు చున్న దూతనడుగగా అతడుఇవి యూదావారిని ఇశ్రా యేలువారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను.
20
హషేం నలుగురు కంసాలులను నాకు కనుపరచగా
21
వీరేమి చేయబోవుచున్నారని నేనడిగి నందుకు ఆయన ఎవడును తలయెత్తకుండ యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును, యూదాదేశస్థులనందరిని చెదరగొట్టుటకై వారిమీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ము లను పడగొట్టుటకును వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను.