కీర్తనలు 3
1
అబ్షాలోమను తన కుమారుని యెదుటనుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. హషేం, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు నామీదికి లేచువారు అనేకులు.
2
దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదనినన్నుగూర్చి చెప్పువారు అనేకులు (సెలా. )
3
హషేం, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు.
4
ఎలుగెత్తి నేను హషేంకు మొఱ్ఱపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతమునుండి నాకుత్తరమిచ్చును.
5
హషేం నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును
6
పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను
7
హషేం, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవునీవే.
8
రక్షణ హషేందినీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. (సెలా. )