Logo

కీర్తనలు 135

1
హషేంను స్తుతించుడి హషేం నామమును స్తుతించుడి హషేం సేవకులారా,
2
హషేం మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, హషేంను స్తుతించుడి.
3
హషేం దయాళుడు హషేంను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము.
4
హషేం తనకొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచు కొనెను.
5
హషేం గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతలకంటె గొప్పవాడనియు నేనెరుగుదును.
6
ఆకాశమందును భూమియందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు
7
భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.
8
ఐగుప్తులో మనుష్యుల తొలిచూలులను పశువుల తొలి చూలులను ఆయన హతముచేసెను.
9
ఐగుప్తూ, నీ మధ్యను ఫరోయెదుటను అతని ఉద్యోగస్థుల యెదుటను ఆయనే సూచకక్రియలను మహత్కార్యములను జరిగించెను.
10
అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు.
11
అమోరీయుల రాజైన ఓగును హతముచేసెను కనాను రాజ్యములన్నిటిని పాడుచేసెను.
12
ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను.
13
హషేం, నీ నామము నిత్యము నిలుచును హషేం, నీ జ్ఞాపకార్థమైన నామము తరతరము లుండును.
14
హషేం తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులనుబట్టి ఆయన సంతాపము నొందును.
15
అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు.
16
వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు
17
చెవులుండియు వినవు వాటి నోళ్లలో ఊపిరి లేశమైన లేదు.
18
వాటినిచేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటితో సమానులగుదురు.
19
ఇశ్రాయేలు వంశీయులారా, హషేంను సన్ను తించుడి అహరోను వంశీయులారా, హషేంను సన్ను తించుడి
20
లేవి వంశీయులారా, హషేంను సన్నుతించుడి హషేంయందు భయభక్తులుగలవారలారా, హషేంను సన్నుతించుడి.
21
యెరూషలేములో నివసించు హషేం సీయోనులోనుండి సన్నుతింపబడును గాక హషేంను స్తుతించుడి.