కీర్తనలు 124
1
యాత్ర కీర్తన. దావీదుది. మనుష్యులు మనమీదికి లేచినప్పుడు హషేం మనకు తోడైయుండనియెడల
2
వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు
3
హషేం మనకు తోడైయుండనియెడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు
4
జలములు మనలను ముంచివేసి యుండును ప్రవాహము మన ప్రాణములమీదుగా పొర్లిపారి యుండును
5
ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురు గాక.
6
వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని హషేం స్తుతినొందును గాక.
7
పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొని యున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొని యున్నాము.
8
భూమ్యాకాశములను సృజించిన హషేం నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.