Logo

కీర్తనలు 11

1
ప్రధానగాయకునికి. దావీదు కీర్తన. హషేం శరణుజొచ్చియున్నాను పక్షివలె, నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట యేల?
2
దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారు చీకటిలో యథార్థహృదయులమీద వేయుటకైతమ బాణములు నారియందు సంధించి యున్నారు
3
పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు?
4
హషేం తన పరిశుద్ధాలయములో ఉన్నాడు హషేం సింహాసనము ఆకాశమందున్నదిఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు.
5
హషేం నీతిమంతులను పరిశీలించును దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు,
6
దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియువారికి పానీయభాగమగును.
7
హషేం నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించు వాడుయథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు.